పవన్ కళ్యాణ్ OG హిట్ తర్వాత దానికి సీక్వెల్ చేస్తానని మాటించ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకుంటారా అనే విషయంలో ఆయన అభిమానులకే నమ్మకం లేదు. కారణం రాజకీయాల్లో అంత బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తర్వాత సినిమా చేస్తారంటే నమ్మకం ఎవరికుంటుంది.
పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీ సెట్ పైకి వెళుతుంది. మెహర్ రమేష్ తో పవాన్ మూవీ అనగానే పవన్ నిర్ణయంతో ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అయినా లేదంటే H వినోద్ తో అయినా సినిమా చేసే అవకాశం ఉంది అనే వార్త మాత్రం అందరికి షాకిస్తుంది.
పవన్ త్వరలో కెవిఎన్ నిర్మాతగా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, ఇంకా డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉంది. రీసెంట్ గా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత పవన్ ని పర్సనల్ గా కలుసుకోవడం ఇన్ని అనుమానాలు తావిచ్చింది. మరి పవన్ గనక ఈ ప్రాజెక్ట్ ఓకె చేస్తే ఫ్యాన్స్ కి హ్యాపీనే.. కానీ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము.