దీపావళి ఫెస్టివ్, లాంగ్ వీకెండ్ భారమంతా ఇప్పుడు కిరణ్ అబ్బవరం పైనే పడింది. ఎందుకంటే ఈ దివాళి కి బాక్సాఫీసు దగ్గర పోటీ పడడానికి నలుగురు యంగ్ హీరోలు రెడీ అయ్యారు. అందులో ఇప్పటికే ప్రియదర్శి మిత్రమండలి, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, తమిళ్ హీరో ప్రదీప్ రంగనాధన్ ల డ్యూడ్ లు ఆడియన్స్ ముందుకు వచ్చేసాయి. ప్రేక్షకులు రిజల్ట్ కూడా ఇచ్చేసారు.
ప్రియదర్శి మిత్రమండలి ని ప్రేక్షకులే కాదు, క్రిటిక్స్ కూడా రిజక్ట్ చేసారు.. ఇక సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా కి ప్రేక్షకుల నుంచి, సినీ విమర్శకుల నుంచి సో సో రిజల్ట్ వచ్చింది. ఈ శుక్రవారమే లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో తెలుగులో ప్రూవ్ చేసుకున్న ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్ కూడా విడుదలైంది.
డ్యూడ్ చిత్రానికి సూపర్ హిట్ పడకపోయినా.. యావరేజ్ టాక్ ని డ్యూడ్ సొంతం చేసుకుంది. మరి ఈ మూడు చిత్రాల్లో ఒక్క చిత్రం కూడా ఆడియన్స్ ని 100 పెర్సెంట్ ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అందుకే దివాళి బాక్సాఫీస్ భారమంతా రేపు శనివారం విడుదల కాబోయే కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ పై పడింది.
టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా K-ర్యాంప్ నచ్చుతుంది అంటున్నారు. ఈ దివాళీ కి K -ర్యాంప్ నుంచి కాస్త హిట్ టాక్ పడినా.. కిరణ్ అబ్బవరం దూసుకుపోతాడు. ఎందుకంటే గత ఏడాది దీపావళికి కిరణ్ అబ్బవరం క చిత్రం తో మంచి హిట్ అందుకున్నాడు. అందుకే ఈ ఏడాది అతని సినిమాపై అందరిలో అంచనాలున్నాయి. చూద్దాం K-ర్యాంప్ రిజల్ట్ ఏమిటి అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.