కింగ్ నాగార్జున తన 100 వ చిత్రాన్ని చాలా సింపుల్ గా స్టార్ట్ చేసారు. తమిళ దర్శకుడు కార్తీక్ తో తన కెరీర్ లో మైలు రాయిలా నిలవబోయే #King 100 ని నాగార్జున స్టార్ట్ చేసారు. ఈ చిత్రంలో ఎవరు ఊహించని సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయనే ప్రచారం మాములుగా జరగడం లేదు.
ఇప్పటికే ఈ చిత్రంలో నాగార్జున సరసన ఎన్నో ఏళ్ళ తర్వాత టబు నటించబోతుంది అంటున్నారు. ఇప్పుడు టబు కాదు ఈ చిత్రంలో జేజెమ్మ నటించబోతుంది అనే ప్రచారం మొదలైంది. కింగ్ నాగార్జున తో సూపర్ చిత్రంలో నటించిన అనుష్క శెట్టి తర్వాత నాగార్జున తో రగడ లో అలాగే సోగ్గాడే చిన్న నాయన లో గెస్ట్ రోల్ లో నటించింది.
మళ్ళీ ఇన్నాళ్లకు అనుష్క #King 100 లో నాగార్జునకు జోడిగా నటించబోతుంది అనే టాక్ వినబడుతుంది. ఈమధ్యనే అనుష్క ఘాటీ చిత్రంతో డిజప్పాయింట్ చేసింది. కొన్నిరోజులు అనుష్క సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు కింగ్ 100 లో అనుష్క అనే వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.