అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దసరా ఫెస్టివల్ హాలిడేస్ లో వచ్చిన కన్నడ కాంతారా చాప్టర్ 1 చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా మిగతా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లోను కాంతార చిత్రాన్ని ఆడియన్స్ అక్కున చేర్చుకున్నారు. వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ తోనూ, వీక్ డేస్ లోను కాంతార1 థియేటర్స్ కళకళలాడాయి.
అందుకే రెండు వారాలు తిరిగేలోపే కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ గా 700 కోట్లు కొల్లగొడితే తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 చిత్రం 100 కోట్లు కలెక్ట్ సూపర్బ్ అనిపించింది. ఓ డబ్బింగ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు కలెక్షన్స్ తీసుకురావడం మాత్రం నిజంగా షాకింగ్ విషయమే.
డబ్బింగ్ సినిమా అయినా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అనేది కాంతార 1 చూస్తే తెలుస్తుంది. కాంతార 1 మేకర్స్ అఫీషియల్ గా 717 కోట్లు, 105 కోట్ల పోస్టర్స్ ను రిలీజ్ చేసారు.