కోలీవుడ్ లో ఫేమస్ అయిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మొట్టమొదటిసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో జతకడుతూ ద రాజా సాబ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గానే మలయాళంలో మోహన్ లాల్ తో హృదయపూర్వం చిత్రంతో సక్సెస్ అందుకున్న మాళవిక మోహనన్ ప్రస్తుతం తన ఆశలన్నీ రాజా సాబ్ పైనే పెట్టుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఎపుడు అందాలు ఆరబోసేందుకు ఆసక్తి చూపించే మాళవిక మోహనన్ గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గదు. వీలైనంతగా అందాలు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. రాజా సాబ్ లోను మాళవిక గ్లామర్ షో వేరే లెవల్ లో ఉండబోతున్నట్టుగా టీజర్, ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది.
తాజాగా మాళవిక మోహనన్ మేనిఫెస్టో లైఫ్ మ్యాగజైన్ కవర్ పేజీ పై మెరిసింది. కాదు కాదు అందాలు ఆరబోస్తూ అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది. అంతలాంటి గ్లామర్ షో తో మాళవిక మోహనన్ రెచ్చిపోయింది. సెప్టెంబర్-అక్టోబర్ మ్యాగజైన్ కవర్ పేజీ పై మాళవిక అందాల షో ని మీరు కూడా తనివితీరా ఆస్వాదించండి.