Advertisementt

తెలుసు కదా ఓవర్సీస్ పబ్లిక్ టాక్

Fri 17th Oct 2025 10:33 AM
telusu kada  తెలుసు కదా ఓవర్సీస్ పబ్లిక్ టాక్
Telusu Kada Overeseas Public Talk తెలుసు కదా ఓవర్సీస్ పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆతర్వాత అభిమానుల అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. జాక్ అంటూ స్పై థ్రిల్లర్ చేసిన సిద్దు కి ఆ చిత్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది. అదే ఊపులో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ చేసిన తెలుసు కదా చిత్రంలో నటించాడు. క్యూట్ బ్యూటీస్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లతో రొమాన్స్ చేసిన సిద్దు తెలుసు కదా ఈరోజు అక్టోబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్ లో తెలుసు కదా షోస్ పూర్తి కావడంతో నెటిజెన్స్ సినిమా ఎలా ఉందొ తమ తమ స్పందనను సోషల్ మీడియా లో తెలియజేస్తున్నారు. తెలుసు కదా ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. 

తెలుసు కదా కి మెయిన్ పిల్లర్ సిద్ధూ జొన్నలగడ్డ. కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ కనెక్టవిటి ఉన్నప్పటికీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంది. ప్రేమ, నవ్వులు, భావోద్వేగాలతో కూడిన రిఫ్రెషింగ్ రొమాంటిక్ రైడ్ ఇది.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు. 

దర్శకురాలిగా మారిన నీరజ కోన సినిమాని చాలా బాగా డీల్ చేశారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి గ్లామర్ గాను, నటనతోను ఆకట్టుకున్నారు. హర్ష కామెడీ టైమింగ్ పీక్స్‌లో ఉంది. సిద్ధూ అన్నకి కమ్ బ్యాక్ ఫిల్మ్. బొమ్మ సూపర్ హిట్, సిద్ధూ జొన్నలగడ్డ తన యాక్టింగ్, ఎనర్జీతో మెరిసిపోయాడు.. మరో ప్రేక్షకుడు చెప్పుకొచ్చాడు. 

మరి తెలుసు కదా అసలు కథ ఏమిటి అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో.. 

Telusu Kada Overeseas Public Talk:

Telusu Kada Social Media Talk

Tags:   TELUSU KADA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ