Advertisementt

ప్రెగ్నెన్సీ రూమర్స్ పై సోనాక్షి వెటకారం

Fri 17th Oct 2025 12:19 PM
sonakshi  ప్రెగ్నెన్సీ రూమర్స్ పై సోనాక్షి వెటకారం
Sonakshi Sinha on her Pregnancy ప్రెగ్నెన్సీ రూమర్స్ పై సోనాక్షి వెటకారం
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులోకి సుధీర్ బాబు జటాధరా చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ లోను స్టార్ హీరోలతో నటించిన సోనాక్షి సిన్హా గత ఏడాది తాను ప్రేమించిన జహీర్ ఇక్బాల్ ని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సోనాక్షి సిన్హా పై ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం అనేది సోషల్ మీడియాలో  పరిపాటిగా మారింది. 

రీసెంట్ గాను సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి ఓ ఈవెంట్ కి వెళ్ళింది. సోనాక్షి పొట్ట కాస్త ఎత్తుగా ఉండడంతో మరోమారు సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ మీడియా సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ వార్తలు వండి వారుస్తుంది. దానితో సోనాక్షి సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీ వార్తలపై వెటకారంగా స్పందించింది. 

ఎన్నో నెలలుగా తన ప్రెగ్నెన్సీ పై వస్తున్న వార్తలపై సోనాక్షి స్పందిస్తూ.. 16 నెలలకు పైగా ప్రెగ్నెంట్ గా ఉండటం వరల్డ్ రికార్డు పొట్ట భాగంపై చెయ్యి వేసి ఫొటో దిగినందుకు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసారు. వాటికి మా సమాధానం ఇదే అంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. 

Sonakshi Sinha on her Pregnancy:

Sonakshi Clears Pregnancy Rumours With Hilarious Post

Tags:   SONAKSHI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ