తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేఖంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం హిందీ కి వ్యతిరేఖంగా తీసుకుంటున్న నిర్ణయాలు బీజేపీ కి ప్రాణసంకటంగా మారాయి. తమపై బీజేపీ ప్రభుత్వం హిందీని బలవతంగా రుద్దాలని చూస్తుంది అని దీనిని అడ్డుకోవడంలో భాగంగానే తమిళనాడు లో స్టాలిన్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోంది.
తమిళనాట హిందీ భాషను నిషేదించేలా చట్టం తీసుకురావాలని, అందుకోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలనే ఆలోచనలో స్టాలిన్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా తమిళనాడులో హిందీ హోర్డింగ్స్, అలాగే హిందీ సినిమాలు, హిందీ పాటల పై కూడా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
హిందీ హోర్డింగ్‌లు, సినిమాల పై నిషేధం కోరుతూ అసెంబ్లీ లో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందరూ షాకవుతున్నారు. ఇలా అయితే తమిళనాట హిందీ సినిమా రిలీజ్ లు ఇకపై కష్టమే అంటున్నారు.