పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతి తో చేస్తున్న ద రాజా సాబ్ జనవరి 9, 2026 లో విడుదలకాబోతుంది. రాజా సాబ్ విడుదలైన ఆరు నెలలకి అంటే ఆగష్టు లో ప్రభాస్.. హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం విడుదల అంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ చిత్రాన్ని ఆగస్టు లో రిలీజ్ చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ తేదీ నుంచి ఫౌజీ ని పోస్ట్ పోన్ చేసే ఆలోచన లేదు, అందుకు తగినట్టుగానే సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాము అంటూ ఫౌజీ ప్రొడ్యూసర్ డ్యూడ్ ప్రమోషన్స్ లో రివీల్ చేసారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్ ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో మైత్రి ప్రొడ్యూసర్స్ అటు ప్రభాస్ ఫౌజీ, ఇటు ఎన్టీఆర్-నీల్ మూవీస్ ని 2026 లో అనుకున్న తేదీలకే విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్-హను రాఘవపూడి ల ఫౌజీ షూటింగ్ ఇంకో 25 పర్సెంట్ అలాగే సాంగ్స్ చిత్రీకరణ మిగిలి ఉంది. మరి ఈ పది నెలల సమయంలో ఫౌజీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్, VFX కి సమయం సరిపోతుంది. సో మైత్రి వారు చెప్పినట్టే ఫౌజీ ఆగష్టు కి రావడం పక్కా.