బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ వైల్డ్ కార్డు ఎంట్రీ ల నడుమ ఘాటు ఘాటుగా జరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఓల్డ్ హౌస్ మేట్స్ అందరిని తలోదారి చేసే ప్రయత్నంలో భాగంగా గత రాత్రి నామినేషన్స్ హీట్ కనిపించింది. తనూజాను ఒకరు సేవ్ చేద్దామనుకుంటే మరొకరు ఇరికించడం ఇలా జరిగింది.
ఈ వారం నామినేషన్స్ లో తనూజ ను సీరియల్ కేరెక్టర్, నాన్న అంటూ ఫైనల్ దాకా వెళదామని ప్లానా అంటూ అయేషా నామినేట్ చేసింది. సంజన భరణి మద్యన జరిగిన గొడవలో భరణి నామినేట్ అయ్యాడు. సుమన్ శెట్టి, దివ్య, డిమోన్ పవన్ ను హౌస్ మేట్స్ నామినేట్ చెయ్యగా రాము రాధోడ్ ను కెప్టెన్ కళ్యాణ్ తన పవర్స్ తో నామినేట్ చేసాడు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలయ్యింది.
ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన తనూజ ఓటింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంటె ఆతర్వాత స్థానంలో సుమన్ శెట్టి ఉన్నాడు. వీరిద్దరూ దాదాపు పోటాపోటీగా ఓట్లు కొల్లగొడుతున్నారు. ఇక రీతూ ని అవాయిడ్ చేసాక డిమాన్ పవన్ ఆడియన్స్ మనసు గెలుచుకుని టాప్ 3లోకి కొనసాగుతున్నాడు.
అయితే డేంజర్ జోన్ లో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కనిపిస్తున్నారు. బంధాల చక్రంలో ఇరుక్కుని టాస్క్ లు ఆడడం లేదు అంటూ భరణి పై బుల్లితెర ఆడియన్స్ కోపం పెంచుకున్నారు. కాబట్టే ఆయనకు ఓట్లు పడడం లేదు, నాలుగో స్థానంలో భరణి ఉండగా, ఆతర్వాత స్థానంలో ఆయన శిష్యుడు రాము రాధోడ్ ఉన్నాడు.
ఇక భరణి తో తో, ఆడుతూ ఆయన వెనుకే ఉన్న దివ్య చివరి స్థానంలో ఓట్లు రాబడుతుంది. ఏది ఏమైనా భరణి, రాము, దివ్య ఈ ముగ్గురిలో ఒకరైతే ఈవారం ఎలిమినేట్ అవడం పక్కాగా కనిపిస్తుంది.