బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం నటిస్తుంది అంటే ఆ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ఊహకైనను అందడం కష్టం. కారణం హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న ఈ కాంబో నుంచి డిసెంబర్ 5 న అఖండ తాండవం రాబోతుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భీభత్సమైన అంచనాలున్నాయి.
అఖండ కు ఏ మాత్రం తగ్గకుండా అఖండ తాండవాన్ని బోయపాటి సిద్ధం చేస్తున్నారు. అఖండ లో బాలయ్య అఘోర గెటప్ ఎపిసోడ్స్ మొత్తం హైలెట్ అవడమే కాదు, యాక్షన్ సీక్వెన్స్ కూడా సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తుంది. అఖండ రోల్ పై ఆడియెన్స్ కి థియేటర్స్ లో దిమ్మతిరిగే బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
అసలు అఖండ సీక్వెల్ కి తాండవం అనే పదం ఎందుకు పెట్టారో, దానికి అదిరిపోయే తాండవం బాలయ్య ఆడితే ఎలా ఉంటుందో అనేది ఆ సర్ప్రైజ్ అంటున్నారు. థమన్ మ్యూజిక్ తో పరమశివుని తాండవం మాత్రం ఆడియెన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు. అదే అఖండ 2 కి అమిన్ హైలెట్ కూడా అనే టాక్ ని నందమూరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.