మెగాస్టార్ చిరు ప్రస్తుతం అనిల్ రావిపూడి తో మన శంకర్ వర ప్రసాద్ గారు చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నారు. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న మన శంకర్ వర ప్రసాద్ గారు షూటింగ్ మాత్రమే కాదు మీసాల పిల్ల సాంగ్ తో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు దర్శకుడు అనిల్ రావిపూడి. నయనతార-చిరు కాంబోలో వచ్చిన ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.
దీని తర్వాత చిరు.. బాబీ #Mega 158 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా ప్రభాస్ తో ప్రస్తుతం నటిస్తున్న రాజా సాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
దర్శకుడు బాబీ మాళవిక మోహనన్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. రాజా సాబ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న మాళవిక మోహనన్ కు మెగా ఆఫర్ తగిల్తే మాములుగా ఉండదు, ఆ తర్వాత చాలామంది హీరోలు ఆమె కోసం వెయిట్ చేసినా చేస్తారు. మరి చిరు సరసన మాళవిక మోహనన్ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ అప్పుడే ఆత్రుత చూపించేస్తున్నారు.