డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ ఆ స్థాయి హిట్ కోసం కష్టపడుతున్నాడు. కానీ జాక్ సిద్దు జొన్నలగడ్డ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ చిత్రం డిజాస్టర్ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి చేసిన తెలుసు కదా చిత్రంలో జొన్నలగడ్డ నటించాడు. రేపు శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ప్రమోషన్స్ లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ చాలా విషయాలను రివీల్ చేస్తున్నాడు. సినిమా హిట్ అయితే అందరికీ పేరొస్తుంది, ఫెయిల్ అయితే నా మీదే విమర్శలు వస్తాయి. అయినా ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటా అన్న సిద్దు జొన్నలగడ్డ టిల్లు, జాక్ సినిమాల తర్వాత తనపై వచ్చిన ఒత్తిడి గురించి ఓపెన్ అయ్యాడు .
ఏదైనా జయాపజయాలు ఎదుర్కొన్నాకే ఎదుగుదల వస్తుంది. జాక్ ఫెయిల్యూర్ తర్వాత దర్శకుడు శివ కొరటాల గారు కాల్ చేసి నాకు ఒకమాట చెప్పారు.. ఇకపై నువ్వు చేసే ప్రతి సినిమా టిల్లు -జాక్ ఈ రెండు సినిమాల మధ్యలోనే ఉంటుంది అని. ఆ మాటలు నిజంగా నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి.. అంటూ కొరటాల తనను ఎలా మోటివేట్ చేసారో అనేది సిద్దు తెలుసు కదా ప్రమోషన్స్ లో బయటపెట్టాడు.