కర్లీ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ ఎంతగా గ్లామర్ షో చేసినా ఆమెను ట్రెడిషనల్ గానే ఆడియన్స్ అందులోను ఆమె అభిమానులు ఇష్టపడతారు. టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ గా కనిపించడం పై ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. మరి పరదా చిత్రంలో పద్దతిగా కనిపించాను, ఆ సినిమా ఎందుకు చూడలేదు.. టిల్లు స్క్వేర్ పై కంప్లైంట్స్ ఎందుకు అని వాదించింది.
రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి కిష్కిందపురి చిత్రం తో సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. క్యూట్ అండ్ స్వీట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. సింపుల్ గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ లుక్ మాత్రం ఆకర్షణగా కనిపిస్తుంది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ వదిలిన ఫొటోస్ చూస్తే అలానే ఉంది. సింపుల్ గా కనిపించింది. కానీ బ్యూటిఫుల్ గా క్రీం కలర్ చుడిదార్ లో అనుపమ అందంగా కనిపించింది. మీరు కూడా అనుపమ లేటెస్ట్ పిక్స్ పై లుక్ వెయ్యండి.