విలక్షణ నటుడు జగపతి బాబుకు కీర్తి సురేశ్ క్షమాపణలు ఎందుకు చెప్పింది? అని అనుకుంటున్నారా? పెద్దగా తప్పేం చేయలేదులే కానీ, పెళ్లికి పిలవకపోవడమే ఆమె చేసిన తప్పు. కింగ్ నాగార్జుననే.. చైతూ పెళ్లికి ఎందుకు పిలవలేదు? అంటూ జగపతి బాబు ప్రశ్నించారు. ఇక కీర్తిని అడగకుండా ఉంటారా? అడిగేశారు. జగ్గూ భాయ్ హోస్ట్‌గా జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు అనే టాక్ షో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు కీర్తి సురేష్ గెస్ట్‌గా వచ్చారు. రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్.. తన పెళ్లికి జగ్గూ భాయ్‌ని పిలవలేదట. అంతే ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
మరో విషయం ఏమిటంటే.. కీర్తి సురేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తి ప్రేమ గురించి జగ్గు భాయ్‌కి ముందే తెలుసంట. ఈ విషయం స్వయంగా కీర్తీనే చెప్పింది. తన ప్రేమ విషయం చాలా తక్కువ మందికి తెలుసని, అందులో జగపతి బాబు కూడా ఒకరని కీర్తి చెప్పుకొచ్చింది. ఈ మధ్య జగపతి బాబు, కీర్తి సురేష్ కలిసి సినిమాలు చేశారు. అప్పుడు చెప్పి ఉండవచ్చు. కానీ, ప్రేమ గురించి తెలిసిన జగపతి బాబుని పెళ్లికి పిలవకపోవడంపై ఆమె సారీ చెప్పారు.
నా ప్రేమ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీకు కూడా తెలుసు. నేను మిమ్మల్ని బాగా నమ్మాను కాబట్టే.. నా పర్సనల్ విషయాన్ని కూడా మీతో పంచుకున్నాను. కానీ, పెళ్లికి పిలవలేకపోయాను. అందుకు క్షమించండి అని ఈ షోలో జగపతికి కీర్తి సురేష్ చెప్పింది. కీర్తి ఇంట్లో వాళ్ల కంటే ముందే జగపతి బాబుకు ఈ విషయం తెలుసంట. అది మ్యాటర్.