Advertisementt

మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ వాయిదా..

Mon 13th Oct 2025 05:23 PM
chiru meesala pilla song  మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ వాయిదా..
Mana Shankara Vara Prasad Garu First Single Release Postponed మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ వాయిదా..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఒక వైపు చిత్రీకరణ జరుపుకుంటూనే, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, అలాగే ప్రమోషన్స్‌‌పై కూడా మేకర్స్ దృష్టి పెట్టారు. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ఈ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో వైరల్ అవుతుండగా, అంతా ఈ పాట కోసం వేచి చూస్తున్నారు.

కానీ, మీసాల పిల్ల సాంగ్ సోమవారం విడుదల కావడం లేదు. ఈ విషయం స్వయంగా మేకర్సే ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఈ పాటను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతలు తెలియజేశారు. దీంతో, పాట కోసం వేచి చూస్తున్న వారంతా నిరాశ చెందక తప్పలేదు. పాట కోసం ఎదురు చూస్తున్న వారందరికీ, ఆ ఎదురు చూపులకు తగ్గ ఫలితం ఉంటుందని స్వయంగా మేకర్స్ తెలియజేయడంతో.. ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. మరి ఎందుకు ఈ పాటను వాయిదా వేశారనేది మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సినిమాను సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మీసాల పిల్ల సాంగ్ విడుదల నిమిత్తం, అనిల్ రావిపూడి అండ్ టీమ్ చేసిన ప్రొమోషన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పాట ప్రమోషన్స్ కోసం బుల్లిరాజును కూడా మేకర్స్ దింపారు.

Mana Shankara Vara Prasad Garu First Single Release Postponed:

Mana Shankara Vara Prasad Garu First Single Release Update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ