బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం అంతా హౌస్ లో గందరగోళమే కనిపిస్తుంది. ఐదోవారం లో ఫ్లోరా షైనీ, శ్రీజ లు ఎలిమినేట్ అయ్యారు. ఫైర్ స్ట్రోమ్ అంటూ ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కాదు కాదు వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈవారం నామినేషన్స్ హీట్ హౌస్ లో మాములుగా లేదు.
దివ్వెల మాధురి కి దివ్య కి మధ్యలో గొడవ జరగడం, దివ్వెల మాధురి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం ఈ రోజు సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్‌ను నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రోమ్ చేతుల్లో ఉంది. బాల్ టాస్క్ ఆడుతూ నిన్నటివరకు ఉన్న హౌస్ మేట్స్ కి నామినేషన్ పవర్ ఇచ్చేలా బిగ్ బాస్ చేసారు.
అలా ఈ వారం నామినేషన్స్ లోకి తనూజ వాళ్ళ సుమన్ శెట్టి, రమ్య మోక్షణ వల్ల డీమాన్ పవన్, రాము, దివ్య, భరణి, తనుజా లు సోమవారం, మంగళవారం ఎపిసోడ్ లో నామినేట్ అయినట్టు బిగ్ బాస్ లీకులు ద్వారా బయటికి వచ్చేసాయి.