ఈమధ్యనే న్యూ బిగినింగ్ అంటూ సమంత ముంబై లో కొన్న ఇంటి ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ ఇంటికి SAM అనే నేమ్ బోర్డు కూడా తగిలించింది ఇప్పుడు సమంత తన కొత్తింట్లోకి అడుగుపెడుతూ స్పెషల్ పూజలు నిర్వహిస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమంత చాలా సాంప్రదాయంగా చుడిదార్ వేసుకుని కొత్తింట్లో పూజలు నిర్వహించింది. ముఖానికి కుంకుమ పెట్టుకుని సమంత కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ పూజలో కూర్చుంది. అంతేకాకుండా సమంత తన కొత్తింటి పూజ గది ఫొటోస్ ని కూడా షేర్ చేసింది, ఎక్కువగా గుడులు గోపురాలు దర్శించే సమంత కు ఆధ్యాత్మికత చాలా ఎక్కువ అనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం నటనకు బ్రేకిచ్చిన సమంత హెల్త్ టిప్స్ చెబుతూ మెల్లగా పనిలో పడుతుంది. నిర్మాతగా యాక్టీవ్ గా ఉంటూనే మా ఇంటి బంగారం చిత్రంలో నటించేందుకు సిద్దమవుతుంది.