యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నె నితిన్ వివాహం శంషాబాద్ లోకి శంకర్ పల్లిలో అతిరథమహారధుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ సతీసమేతంగా బావమరిది పెళ్లిని దగ్గరుండి నిర్వహించారు. ఎన్టీఆర్ ఈ పెళ్ళిలో తన ఫ్యామిలీతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
నార్నె నితిన్ వివాహం చేసుకున్న శివాని దగ్గుబాటి ఫ్యామిలీ కి దగ్గర అమ్మాయి కావడంతో ఈ పెళ్లి లో వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరాం అలాగే నాగ చైతన్య, నాగార్జున ఫ్యామిలీస్ సందడి చేసాయి ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
నార్నె నితిన్-శివాని రిసెప్షన్ కి కొత్త జంట అఖిల్-జైనబ్ లు హాజరయ్యారు. నార్నె నితిన్-శివాని జంటకు అఖిల్ జంట శుభాకాంక్షలు తెలిపారు. అఖిల్-జైనబ్ ల వివాహం తర్వాత ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ కావడంతో అందరి చూపు అఖిల్ జంటపైనే ఉంది.