బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఈరోజు ఎపిసోడ్ లో ఫ్లోరా షైనీ తో పాటుగా శ్రీజ ఎలిమినేట్ అయినట్లుగా లీకులు వినిపించాయి. అంతేకాదు ఫైర్ స్ట్రోమ్ అంటూ ఈరోజు ఆదివారం ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా ఫ్లోరా ఎలిమినేషన్ జరిగింది.
ఫ్లోరా ను, రీతూ ని ఎవిక్షన్ కు దగ్గరగా ఉన్నారు మీరు బయటకు రండి అంటూ వారిని పిలవగా.. ఫ్లోరా నువ్వు ఎలిమినేట్ అయితే హౌస్ లో ఎవరిని మిస్ అవుతావు అంటే సంజన ను మిస్ అవుతాను అంటూ ఫ్లోరా షైనీ ఎమోషనల్ అయ్యింది. రీతూ పవన్ ను బాగా మిస్ అవుతాను అంటూ ఏడ్చేసింది.
హౌస్ మేట్స్ ని కూడా మీకు హౌస్ లో ఎవరు ఉంటే బావుంటుంది, ఎవరు ఎలిమినేట్ అయితే ఓకే అని అడిగితే.. చాలామంది ఫ్లోరా షైనీ హౌస్ లో పెద్దగా పెర్ఫర్మ్ చెయ్యడం లేదు.. రీతూ కష్టపడుతుంది, రీతూ హౌస్ లో ఉండాలంటూ చెప్పారు. ఫ్లోరా షైనీ తో పాటుగా డబుల్ ఎలిమినేషన్ అంటూ శ్రీజ కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.