బిగ్ బాస్ సీజన్ 9 లో ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ప్రచారం జరుగుతున్నట్టే ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఇప్పటికే నాగార్జున శనివారం ఎపిసోడ్ ముగించేశారు. దానికి సంబందించిన ప్రోమోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ ఈ వారం ఆడిన టాస్క్ లపై నాగార్జున హౌస్ మేట్స్ ని క్లాస్ పీకిన ప్రోమోస్ వచ్చేసాయి.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అయినట్లుగా లీకులు చెబుతున్నాయి. అందులో ఫ్లోరా షైనీ ఈ వారం మొదట ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. మొదటినుంచి ఫ్లోరా షైనీ హౌస్ లో సైలెంట్ గానే కనిపించింది. అలాగే టాస్క్ ల్లోనూ బలం చూపించలేదు.
సంజన తో ఫ్రెండ్ షిప్ కాస్త ఆమెను హైలెట్ చేసినా ఈ వారం బుల్లితెర ఆడియన్స్ ఫ్లోరా షైనీ ని ఎలిమినేట్ చేసారు. ఇక డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఈవారం రీతూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఫ్లోరా, రీతూ లు ఈవారం ఎలిమినేట్ అయితే వైల్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.
అందులో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి, ఆయేషా జీనత్, శ్రీనివాస్ సాయి, టీవీ నటుడు గౌరవ్ గుప్తా లు సీజన్ 9 లోకి వైల్డ్ కార్డు ద్వారా వస్తారని తెలుస్తుంది.