గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. పెద్ది సాంగ్ షూట్ చిత్రీకరణ పూణే లో జరుగుతుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. శివ రాజ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రగడ్ లుక్ కి అభిమానులు తెగ ఇంప్రెస్స్ అయ్యారు.
మార్చ్ 27, 2026 టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై పాన్ ఇండియా మర్కెట్ లో భీభత్సమైన అంచనాలే ఉన్నాయి. ఇకపోతే రామ్ చరణ్ RC 17 ప్రాజెక్ట్ ని రంగస్థలంతో తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ తో చేయబోతున్నట్లుగా ఎప్పుడో ఎనౌన్స్ చేసారు. సుకుమార్ పుష్ప 2 తర్వాత రిలాక్స్ అవుతూ RC 17 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.
తాజాగా RC 17 పై క్రేజీ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. రామ్ చరణ్ సుకుమార్ కలయికలో తెరకెక్కబోయే RC 17 షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి లో మొదలు పెడతారని టాక్ వినబడుతుంది. అప్పటికి రామ్ చరణ్ పెద్ది షూటింగ్ కంప్లీట్ చేస్తారని, ఆ తర్వాత RC 17 సెట్ లోకి అడుగుపెడతారని అంటున్నారు.
ఈలెక్కన చరణ్ గ్యాప్ లేకుండా వరస సినిమాలను లైన్ పెట్టుకుంటూ అభిమానుల్లో నింపుతారన్నమాట.