సర్కారు వారి పాట, దసరా చిత్రాల తర్వాత తెలుగులో కనిపించని కీర్తి సురేష్ ఆతర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది, తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని ని గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకుంది. చాన్నాళ్లుగా టాలీవుడ్ లో కనిపించని కీర్తి సురేష్ ఆ సినిమా లో నటిస్తుంది, ఈ హీరో సినిమాలో నటిస్తుంది అంటున్నారు తప్ప ఏ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు.
తాజాగా కీర్తి సురేష్ కి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ దక్కింది. విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ కి ఛాన్స్ వచ్చేసింది. ఈరోజు అక్టోబర్ 11 న మొదలు కాబోయే రౌడీ జనార్దన్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అగ్రిమెంట్ వగైరాలు పూర్తయ్యాయని సమాచారం.
దిల్ రాజు బ్యానర్ లో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ హీరో రౌడీ జనార్దన్ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈ రకంగా కీర్తి సురేష్ మళ్ళీ టాలీవుడ్ లో కనిపించబోతుంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.