బిగ్ బాస్ సీజన్ 9 లో గత వారం టాస్క్ లు, కంటెస్టెంట్స్ పెరఫార్మెన్సు లు ఆడియన్స్ కి బాగానే నచ్చాయి. కళ్యాణ్-తనూజ జోడి పై బయట ఆడియన్స్ లో క్రేజ్ కనిపిస్తుంది. తనూజ ఆటని, ఆమె బిహేవియర్ ని అందరూ ఇష్టపడుతున్నారు. కానీ హౌస్ లో బాండింగ్స్ ఆమె ఆటను దెబ్బ తీస్తున్నాయి. అదే ఈవారం నాగార్జున శనివారం ఎపిసోడ్ లో హెచ్చరించారు.
తనూజ ని లేపి బెడ్ టాస్క్ లో అమ్మాయిలకు సపోర్ట్ చేస్తే నీకు అందరూ సపోర్ట్ చేసేవారు అన్నారు. అలాగే దివ్య కి కూడా నాగార్జున క్లాస్ పీకారు. అయితే భరణి ఆటను నాగార్జున విమర్శించడమే కాదు గ్యాలరీలో ఉన్న ఆడియెన్ తో భరణి ఆట గురించి నాగ్ మాట్లాడించారు.
ఆమె భరణి గారు మీరు బంధాలతో ఆట చెడగొట్టుకుంటున్నారు. మిమ్మల్ని హౌస్ లో ఎందుకుంచాలో మాకు అర్ధం కావడం లేదు అంటూ భరణి కి ఆమె షాకిచ్చింది. నిజంగానే భరణి మొదటి మూడు వారాలు తనూజాతో నాన్న అని పిలిపించుకుని దివ్య రాగానే తనూజాని పక్కనపెట్టి దివ్య తో అన్న అని పిలిపించుకుంటూ ఆమె తో బాండింగ్ నడుపుతూ ఆట ని పక్కనపెట్టడం భరణికి బయట నెగిటివిటి పెరిగేలా చేసింది. అదే విషయం నాగార్జున కూడా చెప్పారు. మరి ఈ వారం ఇంకెంతమంది నాగార్జున చేతిలో తిట్లు తింటారో అనేది ఈ రోజు నైట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.