అప్పట్లో మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఇండస్ట్రీకి ఎలాంటి హిట్లు ఇచ్చాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.`ఆది` ,` దిల్`, `ఠాగూర్`, `బన్నీ`, `లక్ష్మి`, `యోగి, `కృష్ణ`, `అదుర్స్`, `బద్రీనాధ్`,` నాయక్` లాంటి ఎన్నో మాస్ విజయాలు ఇండస్ట్రీకి ఇచ్చారు. కానీ కాలక్రమంలో వినాయక్ ని అపజయాలు వెంటాడటంతో సక్సెస్ అనే రేసు నుంచి ఎగ్జిట్ అయ్యారు. కొత్త తరం దర్శకులు ఫాంలో కి రావడంతో? పాత నీరు తప్పుకోవడం సహజం అన్నట్లు వినాయక్ విషయంలోనూ జరిగింది. ఈ విషయాన్ని వినాయక్ కూడా వేగంగానే గ్రహించారు.
దీంతో కెప్టెన్ కుర్చీకి బధులు నటుడిగా మ్యాకప్ వేసుకోవాలని కెమెరా ముందుకొచ్చే ప్రయత్నం చేసినట్లే చేసి విరమించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వినాయక్ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే ఆయన మళ్లీ తాజాగా డైరెక్టర్ గా కంబ్యాక్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి రైటర్ వక్కంతం వంశీ కథ అందిస్తున్నారుట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. అయితే వెంకటేష్ కి మాత్రం ఇది రిస్క్ ప్రాజెక్ట్ అనే విమర్శ వ్యక్తమవుతుంది.
వినాయక్ దర్శకుడిగా ఫాంలో లేకపోవడం..వంశీ కథలు సైతం బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో? అలాంటి కాంబినేషన్ లో వెంకీ సినిమా అంటే రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుందో? అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో 300 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోల్లో అతిడి పేరిట ఓ సరికొత్త రికార్డు అది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య లాంటి తోటి హీరోలున్నా వాళ్లకే సాధ్యం కానిది వెంకీ సాధించారు.
దీంతో మార్కెట్ పరంగా వెంకీ ఇమేజ్ ఇప్పుడు నాలుగింతలైంది. ఆయన పారితోషికం కూడా పెరిగిందిప్పుడు. వెంకటేష్ కెరీర్ లో అంత వరకూ వంద కోట్ల సినిమా కూడా ఒకటీ లేదు. అలాంటి స్టార్ అనూహ్యంగా 300 కోట్ల క్లబ్ లోకి చేరడంతో? బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారారు. ఆ తర్వాత మరో సినిమా చేయాలంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నారు. చివరిగా త్రివిక్రమ్ తో ఓ సినిమా లాక్ అయింది. ప్రస్తుతం ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోన్న సమయంలో వినాయక్ వార్త సంచలనంగా మారింది.