చూడగానే స్టన్ అయ్యేలా అందంగా ముస్తాబై కనిపిస్తోంది ఈ నగరం. నాగరికతకు చిహ్నంగా చక్కని ట్రెడిషన్‌తో కనిపిస్తోంది. అందమైన నగర వీధుల్లో విహరిస్తున్న ఈ ప్రేమ జంట ఎవరో పరిచయం చేయాలా? ముచ్చటైన జంట బన్ని-స్నేహారెడ్డి. ప్రస్తుతం నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్‌డామ్ లో విహరిస్తున్నారు. ఎటు చూసినా చక్కని కళాకృతిని తలపించేలా తీర్చిదిద్దిన నగరంలో భారీ భవంతులు నింగిని తాకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.
అక్కడ వీధులను పరిశీలిస్తే ట్రామ్ ట్రెయిన్ ట్రావెల్ చేసే మార్గం కూడా కనిపిస్తోంది. విహారయాత్రలో బన్ని- స్నేహ జంట ఫోజ్‌లు చూడగానే ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరూ జర్కిన్స్ కోట్స్ ధరించి ఫ్యాషనిస్టా కా బాప్ అనే రేంజులో ఫోజులివ్వడం ఆకర్షిస్తోంది. స్నేహారెడ్డి, బన్ని బ్లాక్ గాగుల్స్ ధరించి ఆమ్ స్టర్ డామ్ వీధుల్లో ఫోజులిచ్చిన తీరు సంథింగ్ స్పెషల్ అంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు. ప్రయాణ షెడ్యూల్ లేదు.. కేవలం మాయాజాలం మాత్రమే! అనే క్యాప్షన్ ని ఈ ఫోటోలకు జోడించారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
ఓవైపు అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలోని తన తదుపరి చిత్రం షెడ్యూళ్లతో బిజీగా గడిపాడు. ఇప్పుడు ఫ్యామిలీతో కొద్దిరోజుల విరామాన్ని ఆస్వాధిస్తున్నాడు. ఈ విహార యాత్రను ముగించిన తర్వాత తన తదుపరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభిస్తాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలలో ఒకటిగా నిలవనుందని గుసగుస వినిపిస్తోంది.