Advertisementt

బావమరిది పెళ్ళిలో తారక్ ఫ్యామిలీ సందడి

Sat 11th Oct 2025 09:51 AM
ntr  బావమరిది పెళ్ళిలో తారక్ ఫ్యామిలీ సందడి
Jr NTR Family at Brother-in-Law Nithiin’s Wedding బావమరిది పెళ్ళిలో తారక్ ఫ్యామిలీ సందడి
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం అక్టోబర్ 10 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నె నితిన్ వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. మ్యాడ్ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన నార్నె నితిన్ ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ 2 చిత్రాలతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న నార్నె నితిన్ ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్లి పీటలెక్కాడు. 

హీరో దగ్గుబాటి వెంకటేశ్‌కు బంధువుల అమ్మాయి శివానీ తో నార్నె నితిన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళిలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి, కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో సందడి చేసిన ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నితిన్-శివాని జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, ప్రముఖులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో జరిగిన నార్నె నితిన్ పెళ్లి వేడుకకు నాగ చైతన్య, కళ్యాణ్ రామ్ ఇంకా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నార్నె నితిన్-శివాని పెళ్ళిలో తారక్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Jr NTR Family at Brother-in-Law Nithiin’s Wedding:

Jr NTR Brother-in-law Narne Nithin Wedding Reception Celebrations

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ