బిగ్ బాస్ సీజన్9 లో ఐదో వారం పూర్తి కావడానికి జస్ట్ కొన్ని గంటల సమయమే ఉంది. గత రెండు వారాల్లో హౌస్ లో నాన్న-బిడ్డ ప్రేమ అంతా ఫేక్ అంటూ తనూజ కళ్యాణ్ తో స్నేహం చెయ్యడమే కాదు అతని గెలుపుకు అడుగడుగునా కారణమవుతూ కళ్యాణ్ కి కెప్టెన్సీ అందించింది. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి రావడానికి పెట్టిన టాస్క్ ల్లో తనూజ-కళ్యాణ్ పోరాడారు.
ఆ జంటలో ఎవరో ఒకరే సేఫ్ జోన్ కి వెళ్లాలి అంటే అందులో కళ్యాణ్ వెళ్తానంటే తనూజ త్యాగం చేసింది. తర్వాత టాస్క్ లో తనూజ ను గెలిపించేందుకు భరణి, దివ్య హెల్ప్ చేసారు, తనూజ ఆ టాస్క్ నెగ్గి కెప్టెన్సీ టాస్క్ కి వచ్చింది. కానీ కెప్టెన్సీ టాస్క్ లో తనూజ దివ్యని మోసం చేస్తూ కళ్యాణ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడంతో భరణి, దివ్యలు తనూజ మోసం చేసింది అని ఫీలైపోయారు.
ఇమ్మన్యువల్ కూడా తనూజ రెండు వారాలుగా ఏం ఆడుతుందో అర్ధం కావడం లేదు అంటూ భరణితో అంటున్నాడు. ఇక కెప్టెన్సీ బ్యాండ్ పెట్టేటప్పుడు దివ్యని పిలిచిన కళ్యాణ్ ఫోటో ఫ్రేమ్ మాత్రం తనూజ తో పెట్టించుకున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో తనూజ భరణి విషయంలో బాగా హార్ట్ అయ్యి కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది అనేలా ఉంది.
మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంజన, ఫ్లోరా, రీతూ, పవన్, సుమన్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.