యాంకర్ కమ్ నటి అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అనేది అందరికి తెలుసు. ఈమధ్యన ఐస్ ల్యాండ్ లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసి వచ్చిన అనసూయ భరద్వాజ్.. దసరా పండుగను సెలెబ్రేట్ చేసుకుని ఆ ఫోటొలను కూడా షేర్ చేసింది. భర్త భరద్వాజ్ దసరా కు లేరు, ఆయన్ను మిస్ అవుతున్నాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.
తాజాగా అనసూయ నటించిన అరి మూవీ ఈరోజు అక్టోబర్ 10 న విడుదలయింది. ఈ చిత్రం ఎప్పుడో విడుదలకావాల్సి ఉన్నప్పటికి.. కొన్ని కారణాలతో వాయిదాపడుతూ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జస్ట్ సో సో టాక్ తో అరి మూవీ సరిపెట్టుకుంది.
తాజాగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే ఏంటి అనసూయ పార్క్ లో పడుకుని ఆలోచిస్తున్నావు అంటారు. పార్క్ లో అనసూయ పడుకుని సరదాగా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వదిలింది. బ్లూ శారీ లో అనసూయ క్యూట్ గా బ్యూటిఫుల్ లుక్స్ తో అద్దరగొట్టేసింది.