FireStormIsComing అంటూ స్టార్ మా బిగ్ బాస్ పై హైప్ క్రియేట్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్య రెండు వారాల క్రితమే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు మరో నాలుగు వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాయి. అందుకోసం డేంజర్ జోన్, సేఫ్ జోన్ అంటూ బిగ్ బాస్ టాస్క్ లు పెట్టాడు. అందులో భరణి, దివ్య, కళ్యాణ్ లు సేఫ్ జోన్ లో ఉంటే.. మిగతా తనూజ, సంజన, రీతూ, పవన్, సుమన్ శెట్టి, శ్రీజ, ఫ్లోరా లు డేంజర్ జోన్ లో ఉన్నారు.
వాటర్ టాస్క్ ఆడారు. అందులో సేవ్ అయిన వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ ఆడారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మాన్యువల్, రాము, కళ్యాణ్, దివ్య, తనూజ, భరణి లు పోటీపడ్డారు. అందులో ఎవరి లైట్ ఆపితే వారు.. తమ లైట్ ఆపిన వారిని కనిపెట్టి ఎలిమినేట్ చెయ్యాలి. ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచి బిగ్ బాస్ ఐదో వారానికి కెప్టెన్ అయ్యాడు.
ఫస్ట్ 3 వీక్స్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు, వరసగా నామినేషన్స్ లోకి వచ్చినా ఆడియన్స్ అతన్ని సేవ్ చేస్తూ వచ్చారు. మూడో వారం నుంచి కళ్యాణ్ ఫుల్ టాస్క్ ఆడుతూ తనూజ తో కలిసి మాట్లాడుతూ కనిపించడంతో అతను హైలెట్ అయ్యాడు. తనూజ తో డీల్ చేసుకుని సేఫ్ జోన్ లోకి వచ్చాడు.
ఫైనల్ గా టాస్క్ లు బాగా ఆడి కెప్టెన్ అయ్యాడు. సో ఈ వారం కళ్యాణ్ కెప్టెన్ గా కళ్యాణ్ మరో వారం సేవ్ అయినట్లే.