మలయాళ హీరోలకు కుర్ర హీరోయిన్ పెద్ద షాకే ఇచ్చింది. టాప్ స్టార్స్ కి బిగ్ షాక్ ఇస్తూ 300 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టి మలయాళ ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి నిలిచింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన కొత్త లోక.. అఫీషియల్ గా 300 కోట్ల క్లబ్బులోకి అలవోకగా అడుగుపెట్టింది.
సినిమా విడుదలై ఇన్నివారాలైనా ఇంకా కొత్త లోక చాప్టర్ 1 థియేటర్స్ కళకళలాడుతున్నాయి. కొత్త లోక విడుదలైన ప్రతి భాషలోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ లాంటి స్టార్ హీరోలను కళ్యాణి ప్రియదర్శి వెనక్కి నెట్టి నెంబర్ 1 పొజిషన్ చేజిక్కించుకుంది.
నిజంగా ఇది టాప్ స్టార్స్ కి పెద్ద లెస్సన్ అనే చెప్పాలి. 30 కోట్ల కొత్త లోక 300 కోట్ల మూవీగా దున్నేయ్యడం మలయాళ ఇండస్ట్రీకి కొత్త ఊపునిచ్చింది. థియేటర్స్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ సూపర్ ఉమన్ మూవీ దీపావళి స్పెషల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.