బిగ్ బాస్ సీజన్ 9 లో ఐదోవారం నామినేషన్స్ లో ఇమ్యూనిటితో ఇమ్మాన్యువల్, కెప్టెన్ రాము రాధోడ్ తప్ప మిగతా హౌస్ మేట్స్ మొత్తం ఉన్నారు. కళ్యాణ్, తనూజ, శ్రీజ, రీతూ, పవన్, భరణి, దివ్య, సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి ఇలా మొత్తం నామినేషన్స్ లో ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని అడ్డుకునెందుకు హౌస్ మేట్స్ టాస్క్ లు ఆడుతున్నారు.
భరణి, దివ్య, పవన్, రీతూ, తనూజ, కళ్యాణ్ లు టాస్క్ లు బాగా పెరఫామ్ చేస్తున్నారు. సంజన జంట కూడా బాగానే ఆడుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో ఓట్లు దండుకుంటున్నాడు. కళ్యాణ్ కి గత వారం నుంచి బయట ప్రేక్షకుల సపోర్ట్ బాగా పెరిగింది. కానీ కళ్యాణ్ ఈ వారం టాస్క్ లు బాగా ఆడి తనూజ త్యాగంతో సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. భరణి, దివ్య కూడా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వెళ్లారు.
ఆ తర్వాత తనూజ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంది. తనూజాను బుల్లితెర ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. మూడవ ప్లేస్ లో సంజన ఉంది. ఆతర్వాత నాలుగో స్థానంలో సుమన్ శెట్టి ఉన్నాడు. నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న శ్రీజ దమ్ము ఐదో స్థానంలో ఓట్లు కొల్లగొడుతుంది. చివరిగా ఈవారం డేంజర్ జోన్ లో క్రేజీ కంటేస్టెంట్స్ కనిపిస్తున్నారు.
అందులో ఫ్లోరా, రీతూ, పవన్ లు ఈ వారం డేంజర్ జోన్ లో కనబడుతున్నారు. మరి ఈ వారం టాస్క్ పెరఫార్మెన్స్ తో వీరిలో ఎవరు సేవ్ అయ్యి, ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారో అనేది ఆసక్తికరంగా మారింది.