పవన్ కళ్యాణ్ OG హవా ఇంకా థియేటర్స్ లో నడుస్తూనే ఉంది. సెప్టెంబర్ 25 న విడుదలైన OG చిత్రానికి పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన టాక్ చూస్తే ఈసినిమా సూపర్ హిట్ అవడం పక్కా అనుకున్నారు. అదే ఊపులో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని ముగించేశారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా మారిపోగా.. హరీష్ శంకర్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా మిగతా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అభిమానులకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు హరీష్ కష్టపడుతున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ అవడంతో ఆ సినిమా రిలీజ్ తేదీపై అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది అంటే 2026 మహా శివరాత్రికి ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ వచ్చే ఏడాది ఉస్తాద్ తో ఇంప్రెస్స్ చేసేందుకు రాబోతున్నారన్నమాట.