లవ్ టుడే, ఎంటర్ ద డ్రాగన్ చిత్రాలతో తెలుగులోనూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాధన్ మరో వారం రోజుల్లో డ్యూడ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. డ్యూడ్ ని తెలుగులో భీబత్సంగా ప్రమోట్ చెయ్యడమే కాకుండా.. తాజాగా డ్యూడ్ నుంచి ట్రైలర్ వదిలారు మేకర్స్.
ప్రదీప్ రంగనాధన్ కామెడీ, ఎమోషన్స్ అంటూ మరోమారు కుమ్మేసాడు. అమ్మాయి కోసం, అమ్మాయి చుట్టూ తిరుగుతూ కయ్యదు లోహర్, నేహా శెట్టి లతో ప్రదీప్ లవ్ స్టోరీ, కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. కామెడీకి కామెడీ, రొమాన్స్ కి రొమాన్స్, ఎమోషన్స్ కి ఎమోషన్స్ ఇలా అన్ని వేరియేషన్స్ ను ప్రదీప్ అద్భుతంగా పండించాడు.
డ్యూడ్ కూడా డ్రాగన్ మాదిరి పక్కా కామెడీ ఎంటెర్టైమెంట్ అనేలా ఈ ట్రైలర్ కట్ ఉంది. మరి ప్రదీప్ మళ్ళి ఈ డ్యూడ్ తో గట్టిగా కొట్టడం ఖాయంగానే కనిపిస్తుంది. అక్టోబర్ 17 దివాళి స్పెషల్ గా థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.