బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీస్ కోసం హైప్ క్రియేట్ చేస్తూ కంటెస్టెంట్స్ మధ్యన డేంజర్ జోన్ నుంచి బయటపడేలా టాస్క్ లు పెట్టారు బిగ్ బాస్.. అందులో ఇసుక టాస్క్, పెయింటింగ్ టాస్క్, తర్వాత బరువు ఎత్తే టాస్క్ వీటిల్లో ముందు నుంచి పవన్-రీతూ జంట, భరణి-దివ్య జంటలు టాప్ లో ఉన్నారు, మధ్యలో సంజన-ఫ్లోరా జంట కూడా బాగా పెరఫార్మెన్స్ చేసి టాప్ 2 నుంచి టాప్ 3 లోకి వచ్చారు.
ఇక ఈ టాస్క్ ల్లో తనూజ-కళ్యాణ్ ల జంట లో కళ్యాణ్ నుంచి తనూజ కు సపోర్ట్ సరిగ్గా లేకపోవడంతో పెయింటింగ్ టాస్క్ లో ఈ జంట వెనకపడింది. ఇసుక, వెయిట్ టాస్క్ లో శ్రీజ, సుమన్ జంట వెనకపడ్డారు.. దానితో ఈ జంటలో ఇద్దరిని వరెస్ట్ ప్లేయర్స్ గా పెట్టమని అడిగాడు బిగ్ బాస్.
హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ సుమన్-శ్రీజ జంటలో సుమన్, తనూజ జంటలో కళ్యాణ్ లను వరెస్ట్ ప్లేయర్స్ అన్నారు. తనూజాకు కళ్యాణ్ పూర్తిగా సహకారం అందించలేదు అని, సుమన్ సరిగ్గా పెర్ఫర్మ్ చెయ్యలేకపోయాడు అన్నారు. ఇక వరెస్ట్ ప్లేయర్ విషయంలో దివ్య-శ్రీజ ల నడుమ పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ప్రస్తుతం కళ్యాణ్, సుమన్ లు వరెస్ట్ కంటెస్టెంట్స్ గా డిసైడ్ చేసారు హౌస్ మేట్స్.