అఖండ చిత్రంలో నటసింహ బాలయ్య ను అఘోర గా చూపించి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించిన బోయపాటి.. అందులోని సెకండ్ బాలయ్యను మొదట్లో పవర్ ఫుల్ గా చూపించినా ఆతర్వాత ఆయన కేరెక్టర్ ని అఘోర కేరెక్టర్ ముందు తేల్చేసారు. కానీ ఈసారి అఖండ తాండవంలో బాలయ్య సెకండ్ కేరెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుందట.
అఖండ 2 లో బాలయ్య అఘోర పాత్రలో శివ తాండవం చేస్తే సెకండ్ కేరెక్టర్ పొలిటికల్ టచ్ తో కొత్త తరహాలో ఉంటుందని తెలుస్తుంది. విలన్ పాత్రధారి ఆదిపినిశెట్టి-బాలకృష్ణ నడుమ జరిగే యాక్షన్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో బోయపాటి తెరకెక్కించారని, అలాగే పొలిటికల్ డైలాగ్స్ భారీగా పేలడమే కాదు,ఈ యాక్షన్ సీన్స్ కి అభిమానుల నుంచి విజిల్స్ పడడం ఖాయమని చిత్ర బృందం చెబుతుంది.
డిసెంబర్ 5 న సోలో గా బరిలోకి దిగుతున్న అఖండ తాండవాన్ని ఈసారి నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం పక్కా పబ్లిసిటీ ప్లాన్ లో బోయపాటి ఉన్నారని తెలుస్తుంది. కాంతార మాదిరి నార్త్ ఆడియన్స్ కి అఖండ 2 ని కనెక్ట్ చేస్తే రికార్డుల జాతరే అని మేకర్స్ భావిస్తున్నారట. సో ఈసారి నార్త్ ఆడియన్స్ కూడా అఖండ తాండవం చెయ్యబోతున్నారన్నమాట.