కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో ఒంటరిపోరాటం చేస్తున్నారు. రీసెంట్ గా కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన విజయ్ మెడ చుట్టూ బిగుసుకుంది. ఈ ఘటనకు బాద్యులను చేస్తూ విజయ్ అభిమాన సంఘాల నాయకులను కొంతమందిని అరెస్ట్ చేసినా.. విజయ్ ఈ ఘటనపై స్టే కావాలని అడిగినా కోర్టు ఇవ్వడం లేదు. ఇలా త్రిముఖ వ్యూహంలో చిక్కుకున్న విజయ్ వెనకడుగు వేస్తున్నారనే మాట వైరల్ అవుతుంది.
విజయ్ గోట్ మూవీ తోనే సినిమాలు ఆపెయ్యాల్సి ఉన్నా.. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో విజయ్ మళ్లీ జన నాయగన్ అంటూ మరో చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం స్టార్ట్ అయినప్పుడే 2026 సంక్రాంతి అంటూ రిలీజ్ డేట్ లాక్ చేశారు. పొంగల్ బరిలో రాజా సాబ్, మన శంకర్ వర ప్రసాద్ గారు తో పాటుగా అనగనగ ఒక రాజు, విజయ్ జన నాయగన్ కూడా పోటీపడతాయనే అనుకుంటున్నారు.
దానితో తమిళనాట రాజా సాబ్ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు. తాజాగా విజయ్ జన నాయగన్ పొంగల్ బరి నుంచి తప్పుకోవచ్చనే ఊహాగానాలు మొదలయ్య్యాయి. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈచిత్రం టాలీవుడ్ చిత్రానికి రీమేక్ అనే మాట వినబడుతుంది. అయితే ఈ చిత్రం పొంగల్ కి రాకపోవచ్చు, విజయ్ ప్రస్తుతం పొలిటికల్ గా ఒత్తిడిలో ఉన్నారు.
ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్, ప్రమోషన్స్ అంటూ విజయ్ ఫ్రీగా ఉండలేరు, అందుకే జన నాయగన్ ను పొంగల్ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు గట్టిగానే నడుస్తున్నాయి.