సినిమా బ్లాక్ బస్టర్-హీరోయిన్ మోహంలో నవ్వు

Mon 06th Oct 2025 10:07 AM
bhanu rukmini vasanth  సినిమా బ్లాక్ బస్టర్-హీరోయిన్ మోహంలో నవ్వు
Success brought smile on Bhanu Rukmini Vasanth face సినిమా బ్లాక్ బస్టర్-హీరోయిన్ మోహంలో నవ్వు
Advertisement
Ads by CJ

సప్తసాగరాలు దాటి చిత్రం హిట్ తర్వాత మళ్లీ హిట్ మొహం ఎరుగని కన్నడ క్రేజీ భామ రుక్మిణి వసంత్. అయినప్పటికి వరసగా అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చాలా రోజులకి కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కాంతార లో యువరాణిగా కథను మలుపు తిప్పే పాత్రలో రాజసం ఒలకబొయ్యడమే కాదు.. రుక్మిణి వసంత్ లుక్స్ కి ఫిదా కానీ పాన్ ఇండియా ప్రేక్షకులు లేరు.

రిషబ్ శెట్టి నటనకు ఎంతగా పొగడ్తలు వస్తున్నాయో.. రుక్మిణి లుక్స్ కి, ఆమె కేరెక్టర్ కి అంతే అభినందనలు అందుతున్నాయి. తాజాగా రుక్మిణి స్మైలీ ఫేస్ తో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పిక్స్ చూడగానే కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ తర్వాత రుక్మిణి వసంత్ ఫేస్ లో స్మైల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్లు.

అందంగా, ఆకర్షణగా, ట్రెడిషనల్ గా రుక్మిణి లేటెస్ట్ పిక్స్ లో కనిపించింది. ప్రస్తుతం రుక్మిణి స్టార్ హీరోలైన యష్ టాక్సిక్ మూవీ తో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలోను నటిస్తూ క్రేజీగా మారిపోయింది.

 

Success brought smile on Bhanu Rukmini Vasanth face:

  Finally Bhanu Rukmini Vasanth Tasted Success  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ