అవును OG చిత్రాన్ని చేజేతులా మేకర్స్ చంపుకున్నారనే మాట పవన్ ఫ్యాన్స్ నుంచే వినిపిస్తుంది. కారణం బెన్ ఫిట్ షోస్ దగ్గర నుంచి పది రోజుల పాటు OG టికెట్ల రేట్లను పెంచెయ్యడం కామన్ ఆడియన్స్ కు రుచించలేదు, అందుకే OG బావుంది అన్నా థియేటర్స్ కి పోలేదు, OG విడుదలైన రోజు టాక్ చూస్తే, OG కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది అనుకున్నారు.
తీరా చూస్తే OG కి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గించారు. దానితో OG థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనబడుతుంది. నిన్న ఆదివారం బెజవాడ నుంచి అమలాపురం వరకు OG థియేటర్లలో మొదటి రోజు కంటే ఎక్కువ సందడి కనిపించింది, మొన్న దసరా పండగ టైమ్ లోనే OG టికెట్ రేట్లు రేట్స్ తగ్గించాల్సింది, బాగుండేది.. ఇప్పుడు రేట్లు తగ్గాక OG థియేటర్స్ లో ఉన్న చోట ఫుల్ ఫ్యామిలీస్ & కిడ్స్ కనిపిస్తున్నారు.
అసలు రేట్లు పెంచకుండా ఉన్న టికెట్ రేట్ల మీదే సినిమాని విడుదల చేసి ఉంటే OG కలెక్షన్స్ అదిరిపోయేవి, బ్రేక్ ఈవెంట్ అయ్యేది. టికెట్ రేట్లు పెంచుకున్నారు, ఈలోపు కాంతార చాప్టర్ 1 వచ్చి OG ని పడుకోబెట్టేసింది.. OG కి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం మితిమీరిన టికెట్ రేట్లే అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే రేట్లు పెంచకుండా ఉన్న టికెట్ రేట్ల మీదే సినిమాని విడుదల చేసి ఉంటే OG కలెక్షన్స్ అదిరిపోయేవి, టికెట్ రేట్లు పెంచుకున్నారు, ఈలోపు కాంతార చాప్టర్ 1 వచ్చి OG ని పడుకోబెట్టేసింది.. OG కి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం మితిమీరిన టికెట్ రేట్లే అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.