బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి హిట్టు రాదా, ఆమె పోరాటం చెయ్యడమే కానీ, సక్సెస్ మాత్రం జాన్వీ కపూర్ కి అందడమే లేదు. వరసగా యుద్దానికి వెళ్లినా విజయం దక్కని సైకురాలిలా జాన్వీ కపూర్ కనిపిస్తుంది. సౌత్ విషయం పక్కనపెడితే జాన్వీ కపూర్ కి హిందీలో ఇప్పటివరకు హిట్ అనేది దరి చేరలేదు.
రీసెంట్ గా పరం సుందరి దెబ్బేస్తే.. ఇప్పుడు సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా జాన్వీ కపూర్ కి బిగ్ షాకిచ్చింది. కథల ఎంపికలో లోపమో, లేదంటే దర్శకుల సెలక్షన్స్ లో లోపమో తెలియదు కాని జాన్వీ కపూర్ కి హిందీ భాష మాత్రం కలిసి రావడమే లేదు. వరుణ్ ధావన్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సన్నీ సంస్కారికి తులసి కుమారి రీసెంట్ గా విడుదలైంది.
డైరెక్టర్ శశాంక్ కేవలం రెండు పాటలు కాస్త కామెడీ తప్ప మిగతా విషయాల్లో ఫోకస్ చెయ్యలేదు. సన్నీ సంస్కారికి తులసి కుమారి రొటీన్ రొట్ట కామెడీగా మిగిలిపోయింది. కరణ్ జోహార్ కూడా ఎందుకంత లైట్ తీసుకున్నారో అనేది సన్నీ సంస్కారికి తులసి కుమారి చూస్తే అర్ధమవుతుంది.
బాబోయ్ జాన్వీ మళ్ళినా అంటూ సన్నీ సంస్కారికి తులసి కుమారి రిజల్ట్ చూసి నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.