150 కోట్ల ఆస్తులున్న టాలీవుడ్ క‌పుల్

Star couples shocking Property ValueStar couples shocking Property Value

వంద‌ల కోట్ల ఆస్తులున్న క‌థానాయిక‌ల జాబితాను తిర‌గేస్తే... జూహీ చావ్లా, ఐశ్వ‌ర్యారాయ్, సోన‌మ్ క‌పూర్, ప్రీతి జింతా, క‌త్రిన కైఫ్‌, దీపిక ప‌దుకొనే, న‌య‌న‌తార‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్థాయి నిక‌ర ఆస్తుల‌కు చేరుకోలేదు కానీ, ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న కూడా 100కోట్ల నిక‌ర ఆస్తులున్న క‌థానాయిక‌ల జాబితాలో చేరిపోతోంది.

ఒక స‌ర్వే ప్ర‌కారం.. రౌడీ బోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పెళ్లాడుతున్న ర‌ష్మిక ఇప్ప‌టికే 66 కోట్ల మేర నిక‌ర ఆస్తుల‌ను త‌న సొంతం చేసుకుంది. ఒక్కో సినిమాకి 10-12 కోట్ల పారితోషికం అందుకుంటున్న ర‌ష్మిక‌కు అత్యంత ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు ఉన్నాయి. మొత్తం ఐదు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ర‌ష్మిక‌కు ఆస్తులున్నాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కూర్గ్, బెంగ‌ళూరు, హైద‌రాబాద్, ముంబైలో ర‌ష్మిక‌కు ఆస్తులున్నాయి. అలాగే బ్యూటీ ఉత్ప‌త్తుల రంగంలోను ర‌ష్మిక పెట్టుబ‌డులు పెట్టింది.

మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 70 కోట్ల మేర ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టార‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. విజ‌య్ ఒక్కో సినిమాకు 15 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడు. అత‌డి గ్యారేజీలో ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు అర‌డ‌జ‌ను పైగానే ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో ఫ్యామిలీ బంగ్లా విలువ 15కోట్లు. ఇంకా అతడికి ప‌లుచోట్ల చెప్పుకోదగ్గ ఆస్తులున్నాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. థియేట‌ర్ల రంగంలోను అత‌డు పెట్టుబ‌డులు పెడుతున్నాడు. వ‌స్త్ర వ్యాపారంలోను రౌడీ బ్రాండ్ పేరు మార్మోగుతోంది. అందుకే ఇప్పుడు విజ‌య్ - ర‌ష్మిక ఉమ్మ‌డి ఆస్తుల విలువ‌ సుమారు 150 కోట్లు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల నిశ్చితార్థం జ‌రుపుకున్న ఈ జంట ఫిబ్ర‌వ‌రి 2026లో పెళ్లికి రెడీ అవుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఈ జంట నిక‌ర ఆస్తుల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

 

Vijay devarakonda and rashmika properties

vijay devarakonda