బిగ్ బాస్ సీజన్ 9 లో ఇరిటేటింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సంజన అనే చెబుతున్నారు ప్రతి ఒక్కరూ.. హౌస్ లో దొంగతనం చేస్తూ ఫన్ క్రియేట్ చేశాను అంటుంది, ఫుడ్ కోసం అలుగుతుంది.. ఆమె వలన హౌస్ మొత్తం సఫర్ అవుతుంది అని హరిత హారిష్ నెత్తి నోరు కొట్టుకుంటుంటే.. బయట బిగ్ బాస్ ఆడియన్స్ సంజన ని చూస్తే చిరాకేస్తుంది అంటున్నారు.
ఈ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున సంజనకు క్లాస్ ఇవ్వడం చూసి సాయిరాం ఫైనల్ గా నాగార్జున సంజన కు క్లాస్ పీకారు అంటూ బుల్లితెర ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు నైట్ రాబోయే ఎపిసోడ్ లో నీకోసం నలుగురు త్యాగాలు చేశారు, కానీ నువ్వేమో హౌస్ మేట్స్ గుడ్లు తినేశావ్, నీవు నెయిల్ పోలిష్ పెట్టుకుంటే నీకొకళ్ళు తినిపించాలి, నీకో అసిస్టెంట్ అంటూ నాగ్ సంజన పై ఫైర్ అయ్యారు.
సంజన తో పాటు పోపు గొడవలో తనూజ కి దివ్య కి కూడా నాగ్ క్లాస్ తీసుకున్నారు. ఇమాన్యువల్ లవ్ స్టోరీ విని ఫీలయ్యాను అన్నారు. ఏది ఏమైనా ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున సంజనని తిట్టడం చాలామందికి నచ్చేసింది సుమీ..