అన్షులా ఎంగేజ్మెంట్ లో జాన్వీ సిస్టర్స్
ఒకప్పుడు బోని కపూర్ పెద్ద భార్య పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్, శ్రీదేవి పిల్లల మధ్యన చాలా డిస్టెన్స్ కనిపించేది. కాని శ్రీదేవి మరణాంతరం శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లతో బోని కపూర్ పెద్ద భార్య పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ లు చాలా ప్రేమగా ఉంటున్నారు. తాజాగా బోని కపూర్ పెద్ద భార్య కుమార్తె అన్షులా కపూర్-రోహన్ ల నిశ్చితార్ధం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు చాలా సరదాగా తమ స్టెప్ సిస్టర్ అన్షులా తో కనిపించారు. బోని కపూర్, అర్జున్ కపూర్ లు అన్షులా కపూర్-రోహన్ ల ఎంగేజ్మెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో జాన్వీ సిస్టర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ వేడుకలో డిజైనర్ వేర్ దుస్తుల్లో కపూర్ సిస్టర్స్ అద్దరగొట్టేసారు. ప్రస్తుతం జాన్వీ, ఖుషి లు అన్షులా ఎంగేజ్మెంట్ వేడుకల్లో సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.