శనివారం వచ్చింది అంటే హోస్ట్ నాగార్జున ఏ కంటెస్టెంట్ తప్పు ని ఎత్తి చూపించి క్లాస్ పీకుతారా అని ఎదురు చూడని బిగ్ బాస్ ప్రేక్షకుడు ఉండడు, బిగ్ బాస్ కి ఆదరణ తగ్గినా.. శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కి మాత్రం మంచి గిరాకీ ఉంటుంది. ఇక వారం రోజులుగా హౌస్ లో జరిగే గొడవలపై నాగార్జున క్లాస్ పీకే రోజు శనివారం రానే వచ్చేసింది.
నాలుగో వారం లో రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ వారం, నాగార్జున ఎవరికీ క్లాస్ తీసుకుంటారో అనే లోపు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన బిర్యానీ రచ్చ ను నాగార్జున చూపించిన ప్రోమో రిలీజ్ చేసారు. టాస్క్ లో గెలిచి బిర్యానీ విత్ థమ్స్ అప్ ని గెలుచుకోమన్నారు బిగ్ బాస్.
ఈ టాస్క్ లో భరణి కి సంజనకు మధ్యన బిర్యానీ దగ్గర ఫైట్ అయ్యింది, నువ్వెంత నీతిమంతుడివో తెలుసు అని సంజన, సంజన విషయంలో భరణి ఫైర్ అయ్యారు. సంజన ఏడుపు స్టార్ట్ చేసింది. ఇదే సంజన హౌస్ లోని సభ్యుల గుడ్లు దాదాపుగా ఏడు గుడ్లను స్టోర్ రూమ్ లో దాక్కుని తినేసి విషయం గత రాత్రి ఎపిసోడ్ లో చూసే ఉంటారు. మరి బిగ్ బాస్ హౌస్ లో బిర్యానీ గొడవ లో హోస్ట్ నాగార్జున చేతిలో ఎవరికి తిట్లు పడతాయో అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.