Advertisementt

కుమార్తె పెళ్లిని సింపుల్ గా కానిచ్చేసిన అంబటి

Sat 04th Oct 2025 01:43 PM
ambati  కుమార్తె పెళ్లిని సింపుల్ గా కానిచ్చేసిన అంబటి
Ambati Rambabu Daughter Srija Wedding in USA కుమార్తె పెళ్లిని సింపుల్ గా కానిచ్చేసిన అంబటి
Advertisement
Ads by CJ

చాలామంది రాజకీయనాయకులు చేతినిండా సంపాదించి వారి వారి హోదా కు తగినట్టుగా నడుచుకుంటూ ఉంటారు. చాలామంది రాజకీయాల్లోకి వచ్చాక వెనకేసుని స్టేటస్ మైంటైన్ చేస్తారు. దానిని వారి ఇంటి ఫంక్షన్స్ లోను, పెళ్లిళ్లలో చూపించుకుంటారు. ఇదేమి విచిత్రం కాదు.. కానీ రాజకీయనాయకులు తమ పిల్లల పెళ్లిళ్లు సింపుల్ గా చేస్తే అది హాట్ టాపిక్కే అవుతుంది. 

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తె వివాహాన్ని సింపుల్ గా చెయ్యడం(చెయ్యాల్సి రావడం) ఇప్పుడు మీడియాలో హైలెట్ అయ్యింది. అమెరికాలో కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల నడుమ అంబటి రాంబాబు కూతురు శ్రీజ వివాహ వేడుకలు ఓ గుడిలో జరిగిపోయాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల వలన తన కుమార్తె పెళ్లి ఇలా అమెరికాలో చెయ్యాల్సి వచ్చింది, తను, తన భార్య మాత్రమే రావాల్సి వచ్చింది.. తన అల్లుడు హర్ష సాఫ్ట్ వేర్ ఇంజినీర్, కుమార్తె డాక్టర్.. వారిరువురి అభిప్రాయాలూ కలిసాయి కాబట్టి పెళ్లి చేసాము. 

అల్లుడు తణుకు ఏరియా అంటే మన ఏరియా వాడే, వీరిని మన దగ్గరకు ఆహ్వానించి అందరిని పిలిచి గొప్పగా పెళ్లి పెళ్లి విందు ఇస్తాము, మా అల్లుడిని అందరికి పరిచయం చేస్తాము అంటూ అంబటి రాంబాబు కుమార్తె వివాహాన్ని అమెరికాలో ఎందుకు జరిపించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు.    

Ambati Rambabu Daughter Srija Wedding in USA:

YSRCP Leader Ambati Rambabu Daughter Marriage photos viral

Tags:   AMBATI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ