ఏపీలో మహిళలకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణములో భాగంగా స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టగా.. మహిళంటే ఫ్రీ బస్ పథకాన్ని యూస్ చెయ్యడం వలన తమకు నష్టం వాటిల్లుతుంది అని ఆటో డ్రైవర్స్ అంతా నిరసన చేపట్టారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆటో డ్రైవర్స్ కు న్యాయం చేస్తన్నయ్ చెప్పడమే కాదు ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది.
ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి 15 వేలు చొప్పున ఆర్థిక సాయం ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద తొలి ఏడాది 2.90 లక్షల డ్రైవర్లకు 436 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేశ్ లో ఆటో డ్రైవర్ షర్ట్స్ ధరించి పాల్గొనడం అందరిని ఆకర్షించింది.
ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 90 వేల 669 మంది లబ్ధిదారుల్ని గుర్తించి 436 కోట్లు కేటాయించింది. వీరిలో ఆటో డ్రైవర్లు 2 లక్షల 25 వేల 621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. అత్యధికంగా బీసీలు లక్షా 61,737 మంది, ఎస్సీలు 70,941 మంది, ఎస్టీలు 13,478 మంది, కాపులు 25,801 మంది, రెడ్లు 7,013, ఈబీసీలు 4,186 మంది, మైనార్టీలు 3,867 మంది, కమ్మ 2,647 మంది, క్షత్రియ 513 మంది, బ్రాహ్మణులు 365 మంది, ఆర్యవైశ్యలు 121 మంది ఉన్నారు. అత్యధికంగా విశాఖ జిల్లాలో 22,955 మందికి లబ్ధి చేకూరనుంది.
ఈ పథకాన్ని ఆరంభించిన తర్వాత ఉండవల్లి నుంచి మూడు ఆటోల్లో సింగనగర్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రయాణం చేసారు.