తేజ సజ్జ-కార్తీక్ ఘట్టమనేని కలయికలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 12 న విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. తేజ సజ్జ యాక్టింగ్, మంచు మనోజ్ విలనిజం, VFX ఇవన్నీ మిరాయ్ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి.
ప్రస్తుతం OG , కాంతార చాప్టర్ 1 చిత్రాల ధాటిని తట్టుకుని మిరాయ్ థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపిస్తున్నారు అంటే ఆ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ ఏమిటో అర్ధమవుతుంది. అయితే ఇంకా థియేటర్స్ లో సక్సె ఫుల్ గా రన్ అవుతున్న మిరాయ్ చిత్రం ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ లేదు అనే టాక్ నడిచింది.
మిరాయ్ ఓటీటీ హక్కులను పాన్ ఇండియా భాషలకు కలిపి జియో ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. ఇప్పుడు మిరాయ్ చిత్రాన్ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. అక్టోబర్ పది నుంచి అంటే మిరాయ్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.
జియో హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి మిరాయ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మిరాయ్ అందుబాటులోకి రానున్నట్లు జియో హాట్ స్టార్ ప్రకటించింది.