Advertisementt

రష్మిక డేరింగ్ స్టెప్

Sat 04th Oct 2025 04:04 PM
rashmika  రష్మిక డేరింగ్ స్టెప్
Rashmika daring step రష్మిక డేరింగ్ స్టెప్
Advertisement
Ads by CJ

చాలామంది ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని చాలా స్పీడుగా పిల్లలను ప్లాన్ చేసుకుని ఆతర్వాత కెరీర్ ని స్పీడప్ చేస్తున్నారు. ఇప్పుడు వారి కోవలోకి రష్మిక చేరిపోయింది. తను ప్రేమించిన హీరో విజయ్ దేవరకొండ ను పెళ్లాడేందుకు సిద్ధమైపోయింది. 

నిన్న శుక్రవారం శుభముహూర్తాన విజయ్ దేవరకొండ ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ రష్మిక విజయ్ తో నిశ్చితార్ధం చేసుకుంది. ఎంత సీక్రెట్ గా చేసినా ఆ విషయం వైరల్ అయ్యి కూర్చుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రష్మిక-విజయ్ దేవరకొండ లు వివాహం చేసుకుంటారని తెలుస్తుంది. ఇప్పుడు రష్మిక డేరింగ్ స్టెప్ వేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్ళికి సిద్ధమైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ప్రస్తుతం రష్మిక హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అక్కడి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. నిమిషం తీరిక లేని లైఫ్ స్టయిల్ లో ఉంది, ఇలాంటి సమయంలోనే రష్మిక పెళ్లి ప్లాన్ చెయ్యడం నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. 

Rashmika daring step:

Vijay Devarakonda and Rashmika Engaged, Wedding Set for Feb

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ