బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆన్ లైన్ గేమ్ విషయంలో పిల్లలను తల్లితండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెబుతూ తన లైఫ్ లో జరిగిన షాకింగ్ సంఘటనను బయటపెట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అనేది ఆయన మాటల్లో..
రీసెంట్ గా అక్షయ కుమార్ కుమార్తె నితార ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడుతుండగా.. ఆ అమ్మాయికి గేమ్ బాగా ఆడుతున్నావ్ అంటూ మెసేజెస్ వచ్చాయని, ఆతర్వాత నువ్వు మెల్ వా ఫీమేల్ వా అని అడిగితె తమ కుమార్తె చెప్పిన సమాధానం తర్వాత తన కుమార్తె ఫోన్ కి అసభ్యకర మెసేజ్ అంటే నూడ్ ఫొటోస్, వీడియోస్ పంపించాలని బెదిరించేవారని..
ఆ మెసేజ్ చూడగానే నా కూతురు వెంటనే గేమ్ ఆపేసి తనకొచ్చిన మెసేజ్ విషయాన్ని తన భార్యకు చెప్పింది. ఆమె అలా చెప్పడం చాలా మంచిదైంది, ఇలా ఆన్ లైన్ గేమ్ వలన చిన్నారులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని, బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారని, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలు ఆడుకునే సందర్భంలో పేరెంట్స్ పిల్లలను గమనిస్తూ ఉండాలని అక్షయ్ కుమార్ ఓ ఈవెంట్ లో తన కుమార్తె కు సైబర్ క్రైమ్ వలన జరిగిన అనుభవాలను బయటపెట్టారు.