బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటివరకు మొదటివారంలో సంజన కెప్టెన్ అయితే, రెండో వారం పవన్ కెప్టెన్ అయ్యాడు, తర్వాత ఇమ్మాన్యువల్ కెప్టెన్ అవ్వగా సంజన కోసం త్యాగం చేసాడు, దానితో డిమోన్ పవన్ మరోసారి టాస్క్ గెలిచి కెప్టెన్ గా గెలిచాడు. ఇక ఈ నాలుగో వారం సీజన్ 9 కి ఎవరు కెప్టెన్ అవ్వాలో బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లు డిసైడ్ చేసాయి.
ఈ వారం కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ చాలా కష్టపడి టాస్క్ లు ఆడినా చివరిలో హౌస్ మేట్స్ సపోర్ట్ తోనే కెప్టెన్ అయ్యారో ఈ నైట్ ఎపిసోడ్ డిసైడ్ చేసినా.. హాట్ స్టార్ లైవ్ లో ఈవారం కెప్టెన్ గా ఎవరు నిలిచారో తేలిపోయింది. రీతూ, రాము, కళ్యాణ్, ఇమ్మాన్యువల్ లు కంటెండర్లు గా చివరి టాస్క్ లో పోటీపడ్డారు.
బజర్ నొక్కి రెయిన్ డాన్స్ చేస్తూ తర్వాత ఓ కంటెండర్ ని పోటీ నుంచి తప్పించాలి. అలా ముందుగా డిమోన్ పవన్ బజర్ నొక్కి కళ్యాణ్ ని లేపేసాడు, తర్వాత శ్రీజ బజర్ ప్రెస్ చేసి డాన్స్ ఇమ్మాన్యువల్ ని లేపేసింది. చివరిగా రీతూ, రాము లలో ఒకరు కెప్టెన్ అవ్వాలి అన్న సమయంలో భరణి బజర్ ప్రెస్ చేసి డాన్స్ చేసి రీతూ ని లేపేసి రాము ని కెప్టెన్ గా చేసినట్లుగా తెలుస్తుంది.
సో బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం కెప్టెన్ ఫైట్ చేసి, భరణి సపోర్ట్ తో రాము నిలిచినట్లుగా తెలుస్తుంది.